తమ వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సంతోషం కలిగించింది. ఇంతవరకు వేతనం కోసం రెండు, మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండింది. తమలాంటి ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. – చరణ్,
పంచాయతీ కార్మికుడు, మస్తీపురం
చిన్న పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరయినప్పుడే పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించడం మాలాంటి కార్మికుల ఆశలకు ఊపిరి నింపింది. ఇక నుంచి మేము కూడా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు తీసుకుంటామనే ప్రకటన సంతోషం కలిగిస్తోంది.
– చుక్క అంజన్న
చింతరెడ్డిపల్లి పంచాయతీ వర్కర్.
గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీన చెల్లిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం. రెండు, మూడు నెలలు దాటినా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ప్రతినెల చెల్లించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించడం మంచిదే. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తాం. – సి.రాజు,
జిల్లా ఉపాధ్యక్షుడు, టీయూసీఐ అమరచింత


