యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు.. | - | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు..

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ, ఇతర సహచర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఎస్పీ సునీతారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తడానికి వీలులేదని, రవాణాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఖాళీగా ఉన్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లను ధాన్యం తరలించడానికి మళ్లించాలన్నారు. అదేవిధంగా ధాన్యం అన్‌లోడ్‌ చేయడానికి గోదాంలలో సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి 30వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకారం ఘనంగా నిర్వహించాలని కోరారు. నిర్దేశించిన విధంగా రోజువారి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా, డీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్‌, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement