ధాన్యం దించేందుకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దించేందుకు సహకరించండి

May 24 2026 12:27 AM | Updated on May 24 2026 12:27 AM

వీపనగండ్ల: వరి ధాన్యాన్ని గోదాంలో దించేందుకు రైతులు తమవంతు సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ కోరారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని గోదాంలో దించేందుకు అదనంగా హమాలీలను ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్లలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని దించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసీల్దార్‌ ఖాజామైనుద్దీన్‌ను ఆదేశించారు. నాలుగు రోజులుగా గోదాం వద్ద పడిగాపులు పడుతున్నామని.. కనీస వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు అడిషనల్‌ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement