వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సునీతరెడ్డి స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయం జరుగుతుందనే భరోసా కలిగించేలా ఎస్పీ చర్యలు తీసుకోవడంతో ఫిర్యాదుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.


