చదువుతోనే సమాజంలో గౌరవం | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే సమాజంలో గౌరవం

Mar 29 2026 8:37 AM | Updated on Mar 29 2026 8:37 AM

వనపర్తిటౌన్‌: చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని.. చదువు లేదంటే రాజకీయాల్లో మాదిగలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డా. కదిరె కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానసభకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జిల్లాలోని మాదిగ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి మాట్లాడారు. మాదిగలు చరిత్రలో మొదటి కళాకారులని.. జాతి అభివృద్ధే లక్ష్యమని, విద్యావంతులు, జ్ఞానవంతులు మాదిగ యువతను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మాదిగలు ఎదగాలని.. పిల్లల్ని వైద్యులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులుగా తయారు చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవంగా జీవించగలరని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని, చదువుతోనే ఏదైన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులు పదవి కాలంలో సమస్యల పరిష్కారానికి శ్రమించి అభివృద్ధి చేయాలని సూచించా రు. మాదిగల ఐక్యవేదిక సభ్యులు పెద్దింటి వెంకటేష్‌, గంధం పరంజ్యోతి, మంద రాములు, మీసాల రాము, చిట్యాల తిరుపతి, వడ్డేమాన్‌ రవి, ద్యారపోగు నాగరాజు, రాజనగరం రాజేష్‌, గంధం ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement