నిర్లక్ష్యమే ‘పాప’మైంది | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే ‘పాప’మైంది

Feb 25 2026 7:06 AM | Updated on Feb 25 2026 7:06 AM

నిర్ల

నిర్లక్ష్యమే ‘పాప’మైంది

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతర నిర్వహణ మొదలు, దాడి ఘటన, తర్వాత కేసుల దర్యాప్తులోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపించిందని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ మండలం కుమ్మెర గ్రామంలో ఆలయం వద్ద సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్‌, మౌనికను పరామర్శించారు. వారి నుంచి ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర బీసీ కమిషన్‌ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు. కుమ్మెర గ్రామంలో ఆలయ పరిసరాలు, సంఘటనా స్థలం, బాధిత కుటుంబం ఇంటిని పరిశీలించిన తర్వాత పోలీస్‌, రెవెన్యూ, ఎండోమెంట్‌ అధికారుల నిర్లక్ష్యం, భద్రతాలోపాలు తేటతెల్లమయ్యాయని వెల్లడించారు.

10 వేలకు మించి భక్తులు..

రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, టి.సురేందర్‌, బాలలక్ష్మి బృందం కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. 10 వేలకు మించి భక్తులు పాల్గొనే జాతర నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కమిషన్‌ చైర్మన్‌ వెల్లడించారు. ఆలయంలో టికెట్‌, నిర్వహణ విషయంలో ఎండోమెంట్‌ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా.. పూర్తిగా సర్పంచ్‌, గ్రామ పెద్దల పెత్తనమే కొనసాగిందన్నారు. పోలీస్‌ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీస స్థాయిలో ఏర్పాట్లు లేవన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పర్యవేక్షణ, ఏర్పాట్లు లేవని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌, ఆర్డీఓ సురేశ్‌, డీఎస్పీ శ్రీనివాసులు తదితరుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర వివరాలను నివేదిక అందించాలని ఆదేశించారు.

నిరసనలు ఉధృతం..

జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాసంఘాల నాయకులు నిరసన శిబిరానికి చేరుకుని బాధితులకు మద్దతు తెలుపుతున్నారు. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్‌ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్‌ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసింది.

కుమ్మెర ఘటనకు

అధికారుల వైఫల్యమే కారణం

రెవెన్యూ, పోలీస్‌, ఎండోమెంట్‌ అధికారుల పర్యవేక్షణ కరువు

చిన్నారి మృతిపై విచారణ సందర్భంగా బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించిన కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు

జిల్లాకేంద్రంలో నాలుగోరోజు కొనసాగిన నిరసనలు

నిర్లక్ష్యమే ‘పాప’మైంది1
1/1

నిర్లక్ష్యమే ‘పాప’మైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement