హస్తకళలకు జీవం పోద్దాం | - | Sakshi
Sakshi News home page

హస్తకళలకు జీవం పోద్దాం

Feb 24 2026 6:56 AM | Updated on Feb 24 2026 6:56 AM

హస్తకళలకు జీవం పోద్దాం

హస్తకళలకు జీవం పోద్దాం

ఆత్మకూర్‌: అంతరించిపోతున్న హస్తకళలకు జీవం పోద్దామని రాష్ట్ర జౌళీశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సువర్చల అన్నారు. సోమవారం ఆత్మకూర్‌లో నిర్వహించిన చేతివృత్తిదారుల అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మ్యాదరి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, చేనేత తదితర వృత్తిదారులు హస్తకళలకు దూరం కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. టెక్నాలజీపై ఆధారపడుతూ ప్రాచీన కళలకు చమరగీతం పాడుతున్నారని.. హస్తకళలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. చేతివృత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా 50 రోజులపాటు నైపుణ్య శిక్షణతో పాటు రోజుకు రూ. 300 చొప్పున పారితోషకం అందిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నాగమణి, వైస్‌చైర్మన్‌ నల్లగొండ శ్రీనివాసులు, కౌన్సిలర్‌ తులసీ వెంకట్రాములు, ఎస్‌బీఐ ఫీల్డ్‌ ఆఫీసర్‌ లోకేష్‌ యాదవ్‌, మహేశ్‌, డీకే ప్రకాశ్‌, తోట రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement