క్రీడలతో ఆరోగ్యం పదిలం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఆరోగ్యం పదిలం

Feb 23 2026 9:24 AM | Updated on Feb 23 2026 9:57 AM

క్రీడలతో ఆరోగ్యం పదిలం

క్రీడలతో ఆరోగ్యం పదిలం

వనపర్తిటౌన్‌: క్రీడలతో ఆరోగ్యం పదిలమని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని వనపర్తి పుర చైర్‌పర్సన్‌ మాధవి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కొనసాగుతున్న సీఎం కప్‌ రాష్ట్రస్థాయి రెండో ఎడిషన్‌ సెపక్‌ తక్రా పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకలకు ఆమెతో పాటు సెపక్‌తక్రా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌ హాజరై విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించాలని, ఓటమిని ఓ మెట్టుల చేసుకొని విజయాన్ని సాధించాలని కోరారు.

మున్సిపల్‌

చైర్‌పర్సన్‌ మాధవి

ముగిసిన సీఎం

కప్‌ రాష్ట్రస్థాయి

క్రీడా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement