ఉదయం 7 నుంచే..
2,125 మంది సిబ్బంది..
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుండగా.. అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్, కౌంటింగ్ నిర్వాహణపై కలెక్టర్ ఆదర్శ్ సురభి, బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ సునీతరెడ్డి పర్యవేక్షణ చేశారు. తొలి విడత ఎన్నికలు జిల్లాలోని ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట, పెద్దమందడి, రేవల్లి, ఏదుల మండలాల్లో కొనసాగనుండగా.. 87 సర్పంచ్, 780 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదు సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావటంతో మిగిలిన 82 సర్పంచ్, 675 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 287 మంది.. వార్డు స్థానాలకు 1,716 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గోపాల్‌పేట మండలం ఏదుట్ల ఏడోవార్డుకు కనీసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఆ వార్డు స్థానానికి ఎన్నిక జరగడం లేదు.
ఎన్నికల సిబ్బంది
కేటాయింపు ఇలా..
మండలం సిబ్బంది
సంఖ్య
ఖిల్లాఘనపురం 642
గోపాల్‌పేట 411
పెద్దమందడి 562
రేవల్లి 225
ఏదుల 235
మండలాల వారీగా వివరాలిలా..
మండలం సర్పంచ్ వార్డుసభ్యులు
స్థానాలు అభ్యర్థులు స్థానాలు అభ్యర్థులు ఓటర్లు
ఖిల్లాఘనఫురం 27 89 198 540 33,554
పెద్దమందడి 22 82 180 440 32,103
గోపాల్‌పేట 13 40 119 291 26,970
ఏదుల 11 39 100 243 17073
రేవల్లి 9 37 78 202 13463
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్.. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫలితాలు వెంటనే వెల్లడించి విజేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. 50 శాతం కోరం ఉంటే ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహిస్తారు.
తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో 675 పోలింగ్ కేంద్రాలు.. 1,23,163 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణకుగాను 2,125 మంది పోలింగ్ సిబ్బంది, 1,050 పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ మూడంచెల బందోబస్తు కల్పించనున్నారు. బుధవారం రాత్రి వరకు పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలను 27 రూట్లుగా విభజించి సామగ్రి, సిబ్బంది, పోలీసుల తరలింపునకు ప్రైవేట్ స్కూల్ బస్‌లను వినియోగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. ప్రతి కేంద్రంలో పీఓ, ఓపీఓ, 200 పైబడి ఓటర్లున్న కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని నియమిస్తారు. సమస్యాత్మక గ్రామాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
82 సర్పంచ్ స్థానాల బరిలో
287 అభ్యర్థులు
675 వార్డులకు 1,716 మంది...
విధుల్లో 2,125 పోలింగ్ సిబ్బంది, 1,050 మంది పోలీసులు
ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
అనంతరం ఓట్ల లెక్కింపు,
ఫలితాల వెల్లడి
కేంద్రాలకు చేరిన సామగ్రి, సిబ్బంది
ఉదయం 7 నుంచే..
ఉదయం 7 నుంచే..
ఉదయం 7 నుంచే..


