స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగాలి
గోపాల్‌పేట: ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం మండల కేంద్రం, ఏదుల తహసీల్దార్ కార్యాలయాలను ఆయన సందర్శించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తుల పోస్టర్ అతికించాలని సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల అధికారులు అయేషా అంజుం, ఎంపీఓ భవాని, తిలక్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.


