21న జాతీయ లోక్ అదాలత్
● కక్షిదారులు సద్వినియోగం
చేసుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఎంఆర్ సునీత
వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ప్రాంగణంలోఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. బుధవారం జిల్లా కోర్టు మందిరంలో న్యాయవాదులు, బ్యాంకు, బీమాసంస్థల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమనే విషయాన్ని కక్షిదారులు గుర్తించాలన్నారు. సివిల్, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద, చెక్ బౌన్స్, రాజీ కుదుర్చుకోగల క్రిమినల్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాజీయే రాజమార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. ఏళ్ల తరబడి కొనసాగే కేసులు ఇరువర్గాల రాజీ, ఒప్పందంతో పరిష్కారమవుతాయని చెప్పారు. లోక్ అదాలత్‌లో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదని, దావా వేయడానికి కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగి చెల్లిస్తారని వివరించారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు జి.కళార్చన , కె.కవిత, కార్తీక్‌రెడ్డి, నోముల అశ్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కిరణ్‌కుమార్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
21న జాతీయ లోక్ అదాలత్


