భరోసాకు ఎదురుచూపులు..
మా కుటుంబం మొత్తం మగ్గంపై ఆధారపడి జీవిస్తోంది. నెలకు రెండు చీరలు సైతం తయా రు చేయలేకపోతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్నకు భరో సా పథకానికి దరఖాస్తు చేసుకున్నా. భరోసా ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు ఆసరా అవుతాయని ఎదురుచూస్తున్నాం.
– బుచ్చన్న, నేత కార్మికుడు, అమరచింత
సొసైటీలో జియో ట్యాగ్ కలిగిన కార్మికులతో నేతన్నకు భరోసా పథకానికి దరఖాస్తు చేయించాం. ఆరు నెలలుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అందడం లేదు. ఈ విషయాన్ని జిల్లా జౌళిశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించాం. ప్రభు త్వం త్వరితగతిన భరోసా పథకం నిధులు విడుదల చేసి నేతన్నలను ఆదుకోవాలి.
– వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు,
అమరచింత చేనేత సహకార సంఘం
జిల్లాలో 380 జియోట్యాగ్ మగ్గాలకు 755 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేతన్నకు భరోసా పథకం నిధులు వచ్చే నెలలో అందనున్నాయి. ఆరు నెలల డబ్బులను కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మంజూరు కాగానే ప్రధాన కార్మికుడితో పాటు అనుబంధ కార్మికుడికి అందుతాయి. – గోవిందయ్య, ఏడీ, గద్వాల
●
భరోసాకు ఎదురుచూపులు..
భరోసాకు ఎదురుచూపులు..


