మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
కొత్తకోట: సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ, కావడి సేవ అంగరంగ వైభవంగా సాగింది. పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకు గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అంబాభవాని ఆలయంలో స్వామివారికి అభిషేకించే కలశాలు, పాల కావడులకు పూజలు చేసి మేళతాళాలు, భాజాభజంత్రీలు, కోలాటాలు, బతుకమ్మలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకొని గణపతి, సుబ్రమణ్య, అయ్యప్పస్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకించారు. సాయంత్రం 6 గంటలకు అయ్యప్పస్వామి మహా పడిపూజ ఘనంగా జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో అయ్యప్ప దీక్షాపరులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు ధూపం నాగరాజు, ప్రధానకార్యదర్శి పొగాకు అనిల్, కోశాధికారి విశ్వనాథం గంగాధర్, ఉపాధ్యక్షుడు లింగేశ్వర్, అర్చకులు జ్యోషి రవికాంత్, జంగం నటరాజ్, అనిల్, గురుస్వాములు ఉమామహేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కవీందర్‌రెడ్డి, మద్దిగట్ల బాలకృష్ణ, సత్యం సాగర్, వేముల సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రవిరెడ్డి, లక్ష్మీనారాయణ, నరేష్, నితిన్‌చారి, భీమకిషోర్ తదితర పాల్గొన్నారు.
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ


