చేప పిల్లల సరఫరాకు ముందుకురాని కాంట్రాక్టర్లు
స్థానిక పెద్ద చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. రాయితీ చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. చేప పిల్లల పంపిణీ కోసం మరో నెలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత చెరువులో వదిలినా ఆశించిన ఫలితాలు అందకపోవడం ఖాయం. ప్రభుత్వం త్వరగా పంపిణీ చేసి ఆదుకోవాలి.
– గోపి, మత్స్యకారుడు, అమరచింత
ఈ ఏడాది ప్రభుత్వం అందించే రాయితీ చేప పిల్లల కోసం ఎదురుచూస్తున్నాం. ప్రతి ఏటా ఇదివరకే చేప పిల్లలు చెరువుల్లో వదిలేవాళ్లం. అధికారులు సైతం తమ చెరువుకు రావాల్సిన మత్స్యబీజాన్ని అందించేవారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారు. త్వరగా సరఫరా చేసి ఆదుకోవాలి. – తెలుగు రాములు, పాన్‌గల్
రాయితీ చేప పిల్లల సరఫరా కోసం గతంలో టెండర్లు ఆహ్వానించాం. నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినా.. ఆశించిన ధరలు లేవనే కారణంతో ఒకరు తప్పుకున్నారు. దీంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. వారంలోగా రీటెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఉచిత చేప పిల్లలను అందించే ప్రయత్నం చేస్తున్నాం.
– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ
● ఆశించిన ధర లేదంటూ
ఆసక్తిచూపని వైనం
● రీ–టెండర్ నిర్వహణకు
సిద్ధమైన అధికారులు
● జిల్లాలో 143
మత్స్య పారిశ్రామిక
సంఘాలు..
13,600 మంది మత్స్యకారులు
● గతేడాది 54.84 లక్షలు
పంపిణీ
అమరచింత: జిల్లాలో రాయితీ చేప పిల్లల సరఫరాకుగాను మత్స్యశాఖ ఇటీవల టెండర్ నిర్వహించినా ఆశించిన ధరలు లేవంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో అధికారులు రీటెండర్ నిర్వహణకు సిద్ధమయ్యారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్టర్ల ద్వారా జిల్లాలో గుర్తించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో రాయితీ చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సొసైటీల్లో నిల్వ ఉన్న డబ్బులతో మత్స్యకారులు ఇదివరకే చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వదులుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, పాలమూరు, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రాయితీ చేప పిల్లల పంపిణీ కొనసాగుతుండగా.. జిల్లాలో ఆలస్యం కావడంతో మత్స్యకారులు ప్రతిరోజు అధికారులను సంప్రదిస్తున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే ఆశించిన మేర పెరుగుదల ఉండక నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు.
● వానాకాలం ముగిసి చలికాలం ప్రారంభమైనా.. ప్రభుత్వం రాయితీ చేప పిల్లలను ఎప్పుడు అందిస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. గతేడాది జిల్లాలో 1.50 కోట్ల చేప పిల్లలను అందిస్తారని ఆశించినా.. సరిపడా నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 54.84 లక్షలు మాత్రమే సరఫరా చేశారు. ఈ ఏడాదైనా రెండు కోట్ల మత్స్యబీజాన్ని పూర్తిస్థాయిలో ఉచితంగా అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం దాటిందని.. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆయా సొసైటీలకు చేప పిల్లలను వెంటనే అందించాలంటున్నారు.
చెరువులు, కుంటలు1052
గతేడాది పంపిణీ చేసిన చేప పిల్లలు
54.84 లక్షలు
చేప పిల్లల సరఫరాకు ముందుకురాని కాంట్రాక్టర్లు
చేప పిల్లల సరఫరాకు ముందుకురాని కాంట్రాక్టర్లు
చేప పిల్లల సరఫరాకు ముందుకురాని కాంట్రాక్టర్లు


