రాష్ట్రస్థాయి రోడ్‌ స్పీడ్‌ సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రోడ్‌ స్పీడ్‌ సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక

Oct 29 2025 9:56 AM | Updated on Oct 29 2025 9:56 AM

రాష్ట

రాష్ట్రస్థాయి రోడ్‌ స్పీడ్‌ సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక

కొత్తకోట: మండలంలోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులకు సోమవారం నారాయణపేట జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి, రిటైర్డ్‌ పీడీ బి.గోపాలం ఆధ్వర్యంలో రోడ్‌ స్పీడ్‌ సైకిల్‌ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ మాధవి తెలిపారు. ఈ పోటీల్లో ఐశ్వర్య, శ్రీలక్ష్మి, పావని, నందిని, బిందు, అఖిల, నందిని, ఇందు, పూజ, చింటు, మాధురి, అనూష, అక్షయ, ఇందు, కీర్తన ప్రతిభ చాటారని, వారిని రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక చేసినట్లు వివరించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేసి అభినందించారు. ఈ నెల 31 నుంచి నవంబర్‌ 2వ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ.76 కోట్లు మంజూరు

వీపనగండ్ల: బీటీ రోడ్ల నిర్మాణాలకుగాను రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.76 కోట్లు మంజూరు చేయించినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నర్సింహ తెలిపారు. మండల కేంద్రం నుంచి కేతేపల్లి వరకు డబుల్‌ బీటీ రోడ్డు, బొల్లారం చౌరస్తా నుంచి కొర్లకుంట ఆర్‌అండ్‌బీ రహదారి, అలాగే కొండూరు, తూంకుంట నుంచి శ్రీరంగాపురం వరకు బీటీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే ఆన్‌లైన్‌ టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

దంపతులకు

మద్యం దుకాణాలు

పాన్‌గల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపులో భార్యాభర్తలకు రెండు షాపులు దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేవు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వెంగళాయిపల్లికి చెందిన గండం ప్రవీణకుమారి, మొగిలి సురేష్‌కుమార్‌ మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. లక్కీడిప్‌లో గౌడ్‌ రిజర్వేషన్‌లో ప్రవీణకుమారికి పాన్‌గల్‌–2 దుకాణం, సురేష్‌కుమార్‌గౌడ్‌కు ఓపెన్‌ కేటగిరిలో కొత్తకోట–3వ దుకాణం లభించింది. ఈ విషయం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

పట్టణాభివృద్ధిపై

ప్రత్యేక దృష్టి

వనపర్తి: పట్టణాభివృద్ధిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని.. ఇదివరకే అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు తీసుకురాగా, మిగిలిన పనులకు తాజాగా మరో రూ.18.70 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు లక్కాకుల సతీష్‌, బి.కృష్ణ, పాకనాటి కృష్ణ, పరశురాం తదితరులతో కలిసి మాట్లాడారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ వనపర్తిని ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని, రూ.కోటి తీసుకొస్తే పాలాభిషేకాలు చేసేవారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పెద్దమొత్తంలో నిధులు తీసుకొచ్చినా.. ప్రచారం చేసుకునే అలవాటు లేదని చెప్పారు. మంజూరైన నిధులతో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం లక్కాకుల సతీష్‌ మాట్లాడుతూ.. మర్రికుంటను మరమ్మతు చేసి అలుగు మార్చడం, తూములు మూసివేయడంతో వరద నీరు రోడ్డుపై పారుతోందని, సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే, అధికారులతో ఇదివరకే చర్చించామన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలకు ప్రస్తుత ప్రభుత్వాన్ని, పాలకులను నిందించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పాకనాటి కృష్ణ, బి.కృష్ణ, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మంచారి, ఎల్‌ఐసీ కృష్ణ, నాయకులు వినోద్‌, శరవంద తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి రోడ్‌ స్పీడ్‌ సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక 
1
1/1

రాష్ట్రస్థాయి రోడ్‌ స్పీడ్‌ సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement