
మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు
● ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ
● 27న లక్కీడిప్ ద్వారా దుకాణాల కేటాయింపు
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించగా ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 5,183 దరఖాస్తులు వచ్చాయి. అయితే 2023 సంవత్సరంలో చేసిన టెండర్ల ప్రక్రియ కంటే ఈసారి దరఖాస్తులు గణనీయంగా తగ్గడంతో మరోసారి గడువు పెంచారు. ఈ నెల 23 వరకు టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఈ నెల 27న కలెక్టరేట్‌లో లక్కీ డిప్ ద్వారా దుకాణాల కేటాయింపు చేయనున్నారు. మద్యం వ్యాపారులకు మరో మూడు రోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిసి వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కొంత మేర టెండర్లు పెరగవచ్చని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు.