
వీరులారా.. వందనం
ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు
● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం
● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఇక్కడి
నుంచే ప్రకటన
శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్‌గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్‌నగర్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.
మహబూబ్‌నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఎల్లప్పుడూ అండగా ఉంటాం..
అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్

వీరులారా.. వందనం