
వెలుగుల దీపావళి
వనపర్తి టౌన్: దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పూలు, ప్రమీద, బాణాసంచా దుకాణాలు ప్రజలతో కిక్కిరిశాయి. మండల కేంద్రాలతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో పండుగ సామగ్రి కొనుగోలు చేయడానికి వచ్చిన వాహనదారులతో రోడ్లన్నీ నిండిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూజ సామగ్రి, బాణసంచా కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద ప్రజలు చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆదివారం సంత కావడం, పండుగ సరుకులు కొనేందుకు ప్రజలు తరలిరావడంతో మార్కెట్ పరిసరాల్లో కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు ఆలయాలను విద్యుదీపాలతో అలంకరించారు. ప్రతి ఇంట ముందు దీపం వెలిగించడానికి మట్టి ప్రమీదలు తీసుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపడంతో వాటికి డిమాండ్ భారీగా పెరిగింది. దీపావళికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, హనుమాన్‌టేకిడి, శంకర్‌గంజ్, కమాన్ చౌరస్తాల్లో పాదాచారులతో పాటు ద్విచక్రవాహనాలతో సందడి నెలకొంది.
రూపాయి నుంచి
రూ.4వేల వరకు
టపాసుల దుకాణాల్లో ఒక్క రూపాయి విలువ కలిగిన బాణాసంచా నుంచి రూ. 4వేల విలువ కలిగినవి కూడా అందుబాటులో ఉంచారు. చిచ్చుబుడ్డీలు, కాకరవత్తులు, వంకాయ బాణాలు, భూ చక్రాలు, తుపాకులు, రాకెట్, లక్ష్మి టపాసులు, వన్‌షాట్, 10 షాట్స్, 25 షాట్స్, 1000 షాట్స్, తదితర టపాసులను వ్యాపారస్తులు సిద్ధం చేసిన స్టాల్స్‌లో ఉంచారు. స్టాల్స్ వద్ద అకస్మత్తుగా ప్రమాదాలు జరిగితే నివారించేందుకు సెప్టీ సిలిండర్, నీళ్లు అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే బాణాసంచా దుకాణాల వద్ద విక్రయాల జోరు కొనసాగింది. ఏదైనా ప్ర మాదం జరిగితే అన్ని టపాసు ల షాపులకు మంటలు అంటుకునే ప్రమాదం ఉందని, స్టాల్స్ ఏర్పాటు చేసిన డాక్టర్ బాలక్రిష్టయ్య క్రీడా ప్రాగంణంలో ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
పూలు, ప్రమీదలు కొనుగోళ్లతో మార్కెట్ బిజీబిజీ
బాణాసంచాల దుకాణాల్లో కిక్కిరిసిన ప్రజలు
ప్రయాణికులతో రద్దీగా బస్సులు

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి