కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు | - | Sakshi
Sakshi News home page

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు

Oct 19 2025 7:05 AM | Updated on Oct 19 2025 7:05 AM

కలగాన

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు

ఆత్మకూర్‌లో మాత్రమే.. ఆహ్లాదకర వాతవరణం ఉండేలా..

మున్సిపాలిటీల వారీగా..

50 లక్షలతో అన్నారు

మంత్రి దృష్టికి తీసుకెళ్లాం

అమరచింత: జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది. దీంతో వాకర్లకు సరైన వేదిక లేకపోవడంతో ప్రధాన రహదారులపై ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్‌ కోసం వెళ్తూ తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వాకర్లు స్థానికంగా వాకింగ్‌ చేసుకునేందుకు ప్రభుత్వం వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీంతో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం కోసం మున్సిపల్‌ బడ్జెట్‌ నుంచి కొంత మేరకు నిధులు వెచ్చించి వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మూడేళ్ల క్రితం జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్‌, పెబ్బేర్‌, కొత్తకోట మున్సిపాలిటీల్లో ప్రతిపాదనలు రూపొందించి సీఎండీ కార్యాలయానికి నివేదికలు పంపి, మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానాల్లో నిధులు మంజూరు చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పాఠశాల మైదానాలు, పార్కుల స్థలాల్లో వాకింగ్‌ ట్రాక్‌లను నిర్మించేందుకు నిర్ణయించారు.

ప్రమాదాల నివారణ కోసం...

తరుచూ వాకింగ్‌ కోసం రహదారులపై వెళ్తున్న వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రతినిత్యం అరగంట పాటు కాలినడక ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు సూచిస్తుండటంతో ఈ మధ్య కాలంలో గ్రామాల్లో సైతం నడకకు ప్రజలు అలవాటు పడుతున్నారు.

కొత్తగా ఏర్పడిన ఆత్మకూర్‌ మున్సిపాలిటీలో మాత్రమే వాకింగ్‌ ట్రాక్‌ పనులు స్థానిక జాతర మైదనంలో మొదలయ్యాయి. సుమారు రూ.20 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టినట్లు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి వెల్లడించారు. గత పాలకవర్గం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఇప్పటి వరకు 80శాతం పనులు పూర్తిచేశారు. వచ్చే రెండు నెలల లోపు వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణ క్రమంలో వాకింగ్‌ కోసం వస్తున్న వాకర్లకు నాణ్యమైన గాలి అందాలని చుట్టూ పచ్చని చెట్లు, గడ్డి పెంచడం వంటివి చేపడుతున్నారు. బేంచీలు, కుర్చీలు, ఓపెన్‌ జిమ్‌ సైతం అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

కొత్త మున్సిపాలిటీల్లో ముందుకు సాగని పనులు

ఆత్మకూర్‌లో 80 శాతం పూర్తి

రహదారులపై వాకింగ్‌ వెళ్లి

ప్రమాదాలకు గురవుతున్న వాకర్లు

అమరచింతలో రూ.50 లక్షల ప్రతిపాదనలతో వాకింగ్‌ ట్రాక్‌కు నిధులు కేటాయించగా.. ఇప్పటి వరకు స్థల పరిశీలనలు, కొలతల వరకే పనులు చేపట్టి నిర్మాణ పనులను గాలికోదిలేశారు. పెబ్బేరు మున్సిపాలిటీల్లో పార్క్‌ల స్థలంలో నడిచేందుకు అనువుగా ఉండే ట్రాక్‌ల నిర్మాణ పనులు సుమారు రూ.10 లక్షలతో చేపట్టగా, ఆత్మకూర్‌లో రూ.20 లక్షలతో వీటిని పూర్తి చేయనున్నారు. కేవలం అమరచింత, కొత్తకోట, పెబ్బేర్‌ మున్సిపాలిటీల్లో తూతూమంత్రంగా వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతుండటం విశేషం.

పట్టణంలోని జెడ్పీఉన్నత పాఠశాల మైదానంలో రూ.50 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తామన్నారు. రెండు మూడు పర్యాయాలు ఏఈలు వచ్చి కొలతలు చేశారు. కానీ ఇంత వరకు వాకింగ్‌ ట్రాక్‌ పనులు ఎందుకు మొదలు పెట్టలేదో అర్థం కావడం లేదు. వాకింగ్‌ ట్రాక్‌ పనులు చేపట్టాలని ఇటీవల మైదానాన్ని సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరిని కోరాం. దీంతో ఆయన స్పందించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

– తిరుమలేష్‌, వాకర్‌, అమరచింత

అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లలో మంజూరయ్యాయి. వాటిలో కొంత వినియోగించి పట్టణంలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరికి నివేదిక అందించనున్నాం. మంత్రి ఆదేశాల మేరకు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్‌ ట్రాక్‌ కోసం స్థలాన్ని పరిశీంచి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

– నాగరాజ్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, అమరచింత

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు 1
1/3

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు 2
2/3

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు 3
3/3

కలగానే వాకింగ్‌ ట్రాక్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement