అవగాహన కల్పిస్తున్నాం..
వరి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై కేంద్రాల నిర్వాహకులకు శిక్షణనిస్తున్నాం. సన్న, దొడ్డురకం గుర్తింపు, తేమశాతం కొలవడం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం.
– అరవింద్, ఏఓ, అమరచింత
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 490 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 40 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉండగా.. అవసరం మేరకు మరిన్ని తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. రవాణా వ్యవస్థ కుంటుపడకుండా ముందస్తు చర్యలు చేపట్టాం.
– జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాల సంస్థ
●
అవగాహన కల్పిస్తున్నాం..


