తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
కొత్తకోట రూరల్: వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లిలో తడిసిన వరి ధాన్యాన్ని శనివారం ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి అన్నదాతలు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కొంటామన్నారు. నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతిచోట కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆటంకాలు లేకుండా బిల్లుల మంజూరు..
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలం జంగమాయపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి మాట్లాడారు. లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి ఆటంకం లేకుండా బిల్లులు మంజూరవుతున్నాయని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేష్‌గౌడ్, బాలరాజు, మల్లేష్, నర్సింహ, యాదగిరి, సురేందర్‌గౌడ్, వేణుగౌడ్, మన్యం, బుచ్చన్న పాల్గొన్నారు.


