హరిత దీపావళికి సహకరించాలి
వనపర్తి విద్యావిభాగం: దీపావళి పండుగను పురస్కరించుకొని గాలి కాలుష్యం చేసే బాణాసంచాకు దూరంగా ఉండి హరిత దీపావళికి సహకరించాలని జిల్లా ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన ఎకో బజార్‌కు శనివారం ముఖ్య అతిథిగా హాజరైన ఆమె కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శించారు. అలాగే అమ్మకానికి ఉన్న వివిధ రకాల సహజ ఉత్పత్తుల గురించి విద్యార్థులతో తెలుసుకున్నారు. కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్‌తో పాటు కళాశాల విద్యార్థులు, వారి వారి గ్రామాల్లో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్, క్యాంపస్ ఎకో బజార్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉమ, లెక్చరర్లు ధామ్‌సింగ్, రామకృష్ణ, మూర్తి, మల్లికార్జున్, స్వప్న, నాగలక్ష్మి, వెంకటస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
చట్టాలు అందరికీ సమానం
ఆత్మకూర్: చట్టాలు అందరికీ సమానమే అని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శిరీష అన్నారు. శనివారం మండలంలోని బాలకిష్టాపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు, ఉన్నత చదువులతో లాభాలు, పోక్సో చట్టం, ర్యాగింగ్ తదితర విషయాల గురించి క్లుప్తంగా వివరించారు. కేజీబీవీ ఎస్‌ఓ స్వప్న, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ముందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో అడ్మిషన్లు
గద్వాల: ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్‌లో 2025–26వి ద్యాసంవత్సరంలో చదివేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ విధానం ద్వారా విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ గొప్ప అవకాశం అని తెలిపారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను 1780మంది అభ్యర్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఇప్పటి వరకు 1065 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన సీట్లకు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17సెంటర్లు ఉన్నాయని ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
హరిత దీపావళికి సహకరించాలి


