ప్రశ్నిస్తే కేసులా..
సాక్షి, నెట్‌వర్క్: ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని జర్నలిస్ట్, ప్రజా సంఘాల నాయకులు శనివారం ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగడుతన్న సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో నివదించారు.


