స్వేచ్ఛను హరించొద్దు
మీడియాపై దాడులు చేయడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రభుత్వాలు మీడియాపై క్షక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. రాజ్యాంగంలో మీడియాకు స్వతంత్ర హక్కు కల్పించింది. అవినీతిని ప్రశ్నిస్తున్న సాక్షి పేపర్ ఎడిటర్‌పై కుట్రతో కేసులు బనాయించడం, భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజలు, ప్రజాస్వామ్యం సంరక్షణ కోసం పాటుబడే మీడియాపై ఆంక్షలు తగవు. – బాల్యనాయక్,
జర్నలిస్టు సంఘం నాయకుడు
రాజ్యాంగం కల్పించిన హక్కును ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కాలరాస్తుంది. మీడియాపై గతంలో ఎప్పుడూ లేని విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు పెట్టడం సరికాదు. భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకుంటారు. – వెంకటన్నగౌడ్,
బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకుడు
●
స్వేచ్ఛను హరించొద్దు


