
ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సస్పెన్షన్
వనపర్తి: జిల్లా ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.విజయ్‌కుమార్ ఓ ఆధార్ కేంద్రం ఏర్పాటుకు అనుమతికిగాను రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని ఆధారాలు లభించడంతో ఈడీఎస్ కమిషనర్ రవికిరణ్ ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈడీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. కొత్తవారిని నియమించే వరకు మహబూబ్‌నగర్ ఈడీఎం చంద్రశేఖర్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మీ–సేవా కేంద్రాలు, ఆధార్ సెంటర్ల నిర్వాహకుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు రాష్ట్రస్థాయి అఽధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మహబూబ్‌నగర్ ఈడీఎం వద్ద ప్రస్తావించగా.. విషయం నిజమే నని గురువారం జిల్లాలో జాయినింగ్ రిపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్‌ను వివరణ కోరగా.. సమాచారం వచ్చిందని, ఇప్పటి వరకు లేఖ రాలేదన్నారు. ఈడీఎంను తొలగిస్తున్నట్లు వచ్చిన ఉత్తర్వుల ప్రతి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పర్యావరణ పరిరక్షణపై
అవగాహన కల్పించాలి
వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో నేషనల్ గ్రీన్ కోర్ కో–ఆర్డినేటర్ సుదర్శన్ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నందుకుగాను ఆయనను అభినందించి మాట్లాడారు. విద్యతో పాటు సామాజిక, పర్యావరణ అంశాలను జోడించి అవగాహన పెంచాలన్నారు. ఈ నెల 15న రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం గ్రీన్ కో–ఆర్డినేటర్లు పర్యావరణ పరిరక్షణలో ఎలా ముందుండాలో సూచించారని, అందుకు అనుగుణంగా పని చేయాలని కోరారు.
● మహబూబ్‌నగర్ అధికారికి
ఇన్‌చార్జ్ బాధ్యతలు