
అన్నదాతల బారులు..
ఆత్మకూర్: పట్టణంలోని పీఏసీఎస్ వద్ద రోజూవారి పరిస్థితే శనివారం కూడా కనిపించింది. మండలంలోని వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే చెప్పులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు వరుసలో పడిగాపులు పడటం కనిపించింది. మధ్యాహ్నం 3 గంటలకు 300 బ్యాగులు రాగా పోలీసుల సహకారంతో రైతులను వరుస క్రమంలో నిల్చోబెట్టి సాయంత్రం వరకు 136 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 96 మంది రైతులకు టోకన్లు ఇచ్చామని.. సోమవారం పంపిణీ చేస్తామని ఏఓ వినయ్‌కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు. ఎస్‌ఐలు నరేందర్, హిమబిందు రాథోడ్ పర్యవేక్షించారు.