
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
వీపనగండ్ల: భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సరికాదని.. రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యాలయ ఆవరణలో పదుల సంఖ్యలో జనాలు ఉన్నారంటే వారి పనులు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోందని, వచ్చిన వారు పని ముగించుకొని త్వరగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. త్వరలో జీపీఓలను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుందని.. వారి సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి, ఆర్‌ఐ కురుమూర్తి తదితరులు ఉన్నారు.