
సాగునీరు పారేనా..?
ముళ్లపొదలతో మూసుకుపోతున్న భీమా కాల్వ
●
నీరందడం లేదు
భీమా కాల్వ గ్రామం మీదుగా వెళ్తున్న చుక్క నీరు అందడం లేదు. కాల్వ కింద పది ఎకరాల పొలం ఉన్నా పంటలు పండించుకోనే అవకాశం కలగడం లేదు. భీమా కాల్వతో సాగునీరు రాకపోయినా చంద్రగఢ్ ఎత్తిపోథల పథకం ద్వారానైన సాగునీరు వస్తుందని ఆశపడ్డా. సాగునీరు లేక వర్షంపై ఆధారపడి పంటలు పండించుకుంటున్నా. భీమా అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా కాల్వ పూడుకుపోతుంది. – దేవర్ల జమ్ములు, ధర్మాపురం
పూడిక తొలగించాలి
భీమా కాల్వ గ్రామం మీదుగా వెళ్తుండటంతో పంటలకు సాగునీరు అందుతుందని సంబరపడ్డాం. కాల్వ మాత్రం తవ్వించారే తప్పా కాల్వ ద్వారా సాగునీటిని అందించడం లేదు. దీంతో ఎప్పుడో తవ్విన కాల్వలు పూడుకుపోతున్నాయి. వీటికి తోడు ముళ్లపొదలు ఏపుగా పెరుగుతుండటంతో కాల్వలు శిథిలావస్థకు చేరువలో ఉన్నాయి.
– దేవర్ల మాసన్న, ధర్మాపురం
పూడికతీత కోసం
ప్రతిపాదనలు
భీమా, సంఘం బండ కాల్వలో అక్కడక్కడ పూడిక తీయడానికి కూలీలతో వీలు కావడం లేదు. దీంతో పాంరెడ్డిపల్లి, నాగల్‌కడ్మూర్ గ్రామాల్లో బాగా లోతుగా ఉన్న కాల్వ ప్రదేశాల్లో పూడికతీత కోసం సుమారు రూ.15 నుంచి రూ.20 లక్షల అవసరమని ప్రతిపాదనలు తయారు చేసి గతేడాది ప్రభుత్వానికి నివేదించాం. ఆయా మండలాల్లో ఎంపీడీఓల సహకారంతో ఉపాధి కూలీలతో కలిసి పూడిక తొలగించే పనులు చేపడుతున్నాం.
– సతీష్, డీఈఈ
అమరచింత: నియోజకవర్గంలోని వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న భీమా కాల్వ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. పూడిక పేరుకుపోవడం, ముళ్ల పొదలు, చెట్ల కారణంగా సాగునీరు ముందుకు సాగట్లేదు. దీంతో రైతులే వీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎనిమిదేళ్ల క్రితం భూత్పూర్ రిజర్వాయర్ కింద అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్, మాగనూర్ మండలాల్లో 32 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం చేశారు. ఆయా మండలాల్లోని చెరువులను నింపడం, పిల్ల కాల్వలతో పంట పొలాలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు.
అక్కడక్కడ ఉపాధి పనులతో..
కాల్వలో పెరిగిన ముళ్లపొదలతో పాటు పూడికతీత పనులను అక్కడక్కడ ఉపాధి హామీ కూలీలతో చేపట్టినా పూర్తి స్థాయిలో వాటిని తొలగించలేకపోతున్నారు. అమరచింత మండలంలోని నాగల్‌కడ్మూర్, పాంరెడ్డిపల్లి శివారులో లోతుగా కాల్వ ఉండటంతో ముళ్లపొదలతో పాటు చెట్లు భారీగా పెరిగాయి. ఈ కారణంగా సాగునీరు పిల్ల కాల్వలతో పాటు చెరువులకు సైతం వెళ్లట్లేదు. భీమా అధికారులు ఆయా మండలాల్లో ఎంపీడీఓల సహకారంలో ఉపాధి హామీ కూలీలతో తాత్కాలికంగా పూడిక తొలగించే యత్నం చేస్తున్నా పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. దీంతో ఎక్కడి పూడిక అక్కడే మిగిలిపోయింది.
32 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం
కుచించుకుపోతున్న ఆయకట్టు
ఆందోళనలో అన్నదాతలు

సాగునీరు పారేనా..?

సాగునీరు పారేనా..?