
24 వేల ఎకరాలకు సాగునీరు..
భీమా కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్ మండలాల్లో సుమారు 24 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే కాల్వలను నిర్మించి సాగునీటిని అందిస్తున్నారు. కాల్వ నిర్మాణంతో పాటు లైనింగ్ పనులు సైతం పూర్తి కావడంతో మొదట్లో సాగునీరు కాల్వ వెంట పుష్కలంగా పారేది. మూడేళ్లుగా కాల్వలో జమ్ముతో పాటు ముళ్లపొదలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం 10 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భీమా ప్రాజెక్టు.. (ఫైల్)
బీమా ప్రాజెక్టు.. (ఫైల్)