
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రహ్మతుల్లా
ఆత్మకూర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎండీ రహ్మతుల్లాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీసీ, ఎఫ్‌ఏసీ కార్యదర్శి సురేంద్రకుమార్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర పశువర్ధక, క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహారి నియమాక పత్రాన్ని రహ్మతుల్లాకు అందజేశారు. వైస్ చైర్మన్‌గా కృష్ణారెడ్డి, సభ్యులుగా వెంకటయ్య, నరేష్, మణెమ్మ, సత్యన్న, శ్యాంకుమార్, రవికాంత్, దేవరకొండ మోహన్, కమళాకర్‌గౌడ్, అరవింద్‌రెడ్డి, విష్ణు, గోవర్ధన్, టీ.రాజు తో పాటు పీఏసీఏస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా కొనసాగుతారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి
క్షమాపణ చెప్పాలి’
వనపర్తి విద్యావిభాగం: బీసీ ఎమ్మెల్యేలను బట్టలు ఉతికే వాళ్లు, చేపలు పట్టే వాళ్లు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని, వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశానుసారం శనివారం రాజనగరంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో గట్టుయాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను విమర్శించడానికే కాంగ్రెస్ వాళ్లు రూ.కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి సభలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కేవలం కేసీఆర్‌ను, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని విమర్శించడానికే తప్ప జిల్లాకు ఇచ్చిందేమి లేదన్నారు. కేసీఆర్ పాలనలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నిరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 90శాతం పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 10శాతం పూర్తి చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి తమ నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, రమేష్‌గౌడ్, విజయలక్ష్మి, ఆంజనేయులు, గంధం పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, నాగన్నయాదవ్, గులాం ఖాదర్ ఖాన్, ఇమ్రాన్, స్టార్ రహీమ్, మురళీసాగర్, డాక్టర్ డ్యానియెల్, సతీష్, బాలరాజు తదితరులు ఉన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రహ్మతుల్లా