
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
కొత్తకోట రూరల్: పాఠశాల, కళాశాల విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. గురువారం మండలంలోని అమడబాకుల కస్తూర్బాగాంధీ విద్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గురువులను దైవ సమానులుగా భావించాలని.. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తకాలు చదవడంతో మానసికోల్లాసంతో పాటు సమయస్ఫూర్తి, జ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో లీగల్ లిటరసీ క్లబ్ ప్రారంభించి టీచర్ కో–ఆర్డినేటర్‌గా ధనుంజయ్‌గౌడ్‌ను, స్టూడెంట్ రిప్రజెంటేటివ్‌గా వేణు, శ్రీమాన్, విద్య, శ్రీవాణిని నియమించారు. కార్యక్రమంలో ప్యానల్ లాయర్ కృష్ణయ్య, గ్రామ పెద్దలు సత్యారెడ్డి, వామన్‌గౌడ్, కృష్ణయ్య, రంగారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు కృష్ణయ్య, సురేంద్రాచారి, ప్రకాష్, శ్రీనివాసులు, విజయ్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్‌గౌడ్, సురేష్‌బాబు, కేజీబీవీ ఎస్‌ఓ చందన, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.