
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.