
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి
ఆత్మకూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్‌కుగాను గురువారం ఆమె స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా రూ.కోటి వ్యయంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ముందుగా రూ.20 లక్షలు బ్యాంకు రుణం పొందేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మండల పరిధిలోని జూరాల గ్రామ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఎం నాగమల్లిక, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద, ఏపీఎంలు శ్రీనివాసులు, సక్రూనాయక్ పాల్గొన్నారు.