
లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షకు ఏర్పాట్లు
వనపర్తి: లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష ఈ 27న నిర్వహించనున్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం పరీక్షల నిర్వహణపై సీసీఎల్‌ఏ లోకేష్‌కుమార్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ హాజరై వివరాలు వెల్లడించారు. 15వ తేదీలోగా పరీక్ష కేంద్రం వివరాలు సిద్ధం చేసి సీసీఎల్‌ఏకు పంపనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొదటి విడత శిక్షణకు 112 మందిని కేటాయించారని.. 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో ఏడీ ల్యాండ్ సర్వేయర్ బాలకృష్ణ, ఏఓ భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు