బడి.. మరిచారు | - | Sakshi
Sakshi News home page

బడి.. మరిచారు

Jul 15 2025 6:09 AM | Updated on Jul 15 2025 6:09 AM

బడి..

బడి.. మరిచారు

పట్టించుకోవడం లేదు..

కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో రిపోర్టింగ్‌ చేసిన మరుసటి రోజే అమ్మ ఆదర్శ పాఠశాల విధుల కోసం డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. విద్యార్థులు నష్టపోతున్నారని డీఈఓతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించాం. గ్రామస్తులు సైతం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు లేని కారణంగా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలి.

– ఐ.నారాయణ, ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, చింతకుంట (పాన్‌గల్‌)

ఆదేశాలిచ్చాం..

అదనపు బాధ్యతలు కేటాయించిన ఉపాధ్యాయులు పని ఉన్నప్పుడు మినహా మిగిలిన రోజుల్లో పాఠశాలల్లో విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశాం. అందరూ పాటించేలా చూస్తున్నాం. సీఎంఓగా నియమించిన, రీప్యాట్రేషన్‌ ఉత్తర్వులపై బడిబాట కార్యక్రమం తర్వాత నిర్ణయం తీసుకుందామని కలెక్టర్‌ చెప్పినందునే పక్కన బెట్టాం. ఆత్మకూర్‌ పాఠశాలలో బయోలజీ ఉపాధ్యాయుడి ఖాళీ విషయం నా దృష్టికి రాలేదు.

– అబ్దుల్‌ ఘనీ, జిల్లా విద్యాధికారి

ఏళ్లుగా డీఈఓ కార్యాలయంలో తిష్టవేసిన ఉపాధ్యాయులు

వనపర్తి టౌన్‌: జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు ఏళ్లుగా బడిబాట మరిచి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆసక్తి చూపకపోగా.. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అధికారులమనే ధీమాలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా విద్యాశాఖలో ఫారెన్‌ సర్వీ్‌స్‌లు, అదనపు సర్వీస్‌లు అనే రెండు విభాగాలున్నాయి. ఫారెన్‌ సర్వీస్‌ కింద విధులు కేటాయించిన ఉపాధ్యాయులు ఐదేళ్ల పాటు డీఈఓ కార్యాలయంలో పూర్తిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరి వేతనం సైతం కార్యాలయం నుంచే చెల్లిస్తారు. అదనపు సర్వీస్‌లో కొనసాగే పలు విభాగాల అధికారులు పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూనే అత్యవసర సమయాల్లో మాత్రమే డీఈఓ కార్యాలయంలో సమయం కేటాయించి నిర్దేశించిన విధులు నిర్వర్తించాలి. అదనపు బాధ్యతల ఉపాధ్యాయులు ఏడాదిలో పది రోజులు, ఎక్కువగా అయితే నెల రోజులు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో పని చేయాలి. కానీ పలువురు ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేశారు. అదనపు బాధ్యతల అధికారుల ఎంపికలో సీనియార్టీ, సిన్సియార్టీ, ఆసక్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని డీఈఓ విచక్షణతో బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా వీరే ఏ అధికారి వచ్చినా మచ్చిక చేసుకొని ఇతరులకు అవకాశం ఇవ్వకుండా కొనసాగుతూ.. వారానికి లేదా నెలకు ఓసారి పాఠశాలకు వెళ్లి సంతకాలు చేసి వేతనాలు పొందుతున్నారే తప్ప పాఠశాలల్లో పాఠాలు బోధించడం లేదన్న ఆరోపణలున్నాయి. డీఈఓ కార్యాలయంలో ఏసీజీఈ, డీసీఈబీ, కార్యదర్శి, డీఎస్‌ఓ, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి, ఓపెన్‌ కో–ఆర్డినేటర్‌, గ్రీన్‌ కో–ఆర్డినేటర్‌, కార్యాలయంలో క్లర్క్‌, తదితర విభాగాలకు పలువురు ఉపాధ్యాయులు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో అత్యధికులు పాఠశాల ముఖమే చూడటం లేదని సమాచారం. పాన్‌గల్‌ మండలం చింతకుంట ప్రాథమిక పాఠశాలకు కేటాయించిన ఓ ఉపాధ్యాయుడు రిపోర్టింగ్‌ చేసిన రెండోరోజే డీఈఓ కార్యాలయంలో విధులు కేటాయించాలంటూ ఓ ఉపాధ్యాయ సంఘం నేతలతో పైరవీ చేయించుకున్నారు. ఆ ఉపాధ్యాయుడిని పాఠశాలకు పంపించాలంటూ గ్రామస్తులు అధికారులకు ఎన్ని వినతులు, విజ్ఞప్తులు చేసినా పట్టి్‌ంచుకోలేదు. కనీసం ఇతర ఉపాధ్యాయుడిని సైతం సర్దుబాటు చేయలేకపోతున్నారు. కొత్తకోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయోలజీ సైన్స్‌ పోస్టులు రెండు మంజూరుంటే ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఆత్మకూర్‌లో ఓ పోస్టు జనవరి నుంచి ఖా ళీగా ఉండటంతో అదనంగా ఉన్న ఉపాధ్యాయుడి ని కేటాయించాలని ప్రధానోపాధ్యాయుడు విన్నవించినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

అదనపు బాధ్యతలతో అసలు విధులకు ఎసరు

పట్టించుకోని అధికారులు, పాలకులు

నష్టపోతున్న విద్యార్థులు

బడి.. మరిచారు 
1
1/4

బడి.. మరిచారు

బడి.. మరిచారు 
2
2/4

బడి.. మరిచారు

బడి.. మరిచారు 
3
3/4

బడి.. మరిచారు

బడి.. మరిచారు 
4
4/4

బడి.. మరిచారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement