
ప్రభుత్వ విద్యార్థులకు పోటీ పరీక్షల తరగతులు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నీట్, జేఈఈ, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందకు ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ నుంచి ఉచిత ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. కళాశాలలో రెగ్యులర్ తరగతులతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ తరగతులు కూడా రోజు ఇంటర్‌బోర్డు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏదేని కారణంతో తరగతులకు హాజరు కాలేని పక్షంలో రికార్డెడ్ వీడియోస్ సైతం చూసే సదుపాయం ఉందని, వేల మంది పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.