సీపీఆర్‌పై శిక్షణనివ్వాలి | - | Sakshi
Sakshi News home page

సీపీఆర్‌పై శిక్షణనివ్వాలి

Jul 15 2025 6:09 AM | Updated on Jul 15 2025 6:09 AM

సీపీఆర్‌పై శిక్షణనివ్వాలి

సీపీఆర్‌పై శిక్షణనివ్వాలి

వనపర్తి: గుండెపోటు బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తక్షణం చేయాల్సిన ప్రాథమిక వైద్యం సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సీపీఆర్‌, క్యాన్సర్‌, క్షయ, సీజనల్‌ వ్యాధులు, మధుమేహం, ఆర్‌బీఎస్‌కేపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నామని, నివారించేందుకు సీపీఆర్‌ విధానంపై జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువమందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని కోరారు. ముందుగా జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది, జిమ్‌ ట్రైనర్లు, విద్యాశాఖలో పీఈటీలు, ఆశా వర్కర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. ఆగస్టు 15 నుంచి నోటి, ఛాతి, గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. మధుమేహం వ్యాధి నిర్మూలనపై సమీక్ష నిర్వహిస్తూ ఇప్పటి వరకు చేపట్టిన హెచ్‌బీ–1సి వైద్య పరీక్షల ద్వారా ఎవరికై తే 8 కన్నా ఎక్కువ రైడింగ్‌ నమోదైందో వారి వద్దకు వైద్యాధికారులు స్వయంగా వెళ్లి షుగర్‌ లేవల్స్‌ పెరగడానికి గల కారణాలు తెలుసుకొని వైద్యం అందించాలన్నారు. వైద్య పరీక్షల డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అందరు వైద్యాధికారులు పర్యవేక్షణ చేసేలా చూడాలని కోరారు. క్షయ బారినపడి జిల్లాలో 16 మంది చనిపోవడానికి కారణాలు ఏమిటి.. వైద్యం అందిస్తున్నప్పటికీ ఎందుకు చనిపోయారనే కారణాలు తెలుసుకునేందుకు ఆడిట్‌ నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆర్‌బీఎస్‌కే ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య ప్రామాణిక కార్డు తయారు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు విద్యార్థులకు అందజేయాలని సూచించారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ఎన్‌ఆర్‌సీ కేంద్రానికి తీసుకొచ్చి వైద్యం అందించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాటరాక్ట్‌ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్యులు, థియేటర్‌ అందుబాటులో ఉన్నాయని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని.. ప్రసవాల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణుల ఏఎన్‌సీ నమోదు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, చికెన్‌ గునియా, డయేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్‌, ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డా. పరిమళ, డా. రియాశ్రీ తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌, క్షయ, సీజనల్‌, అసంక్రమిత వ్యాధులను నియంత్రించాలి

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement