
ఉపాధికి కత్తెర
వనపర్తి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను తగ్గించేందుకు 2008లో నాటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని వారికి, వ్యవసాయం పనులు లేని సమయంలో కూలీలకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించేందుకు ఈ పథకం దోహదపడింది. మొదట్లో ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో పథకానికి ప్రజల నుంచి ఆదరణ పెరిగి, ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో కూలీలు జాబ్ కార్డులు తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం 37.35 లక్షలుగా ఉన్న పనిదినాలు జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 14.9 లక్షలకు కుదించబడినట్లు అధికారిక లెక్కలతో వెల్లడవుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త నిబంధనతో కూలీలు పనికి దూరవుతున్నారు.
జిల్లాలో పని దినాల తగ్గుముఖం
గతేడాది జిల్లాకు 23.8 లక్షల పని దినాలు కేటాయించగా..
ప్రస్తుతం 14.9 లక్షలకు కుదింపు

ఉపాధికి కత్తెర