
అమ్మా.. బైలెల్లినాదే
ఆత్మకూర్: పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపాలిటీ, పంచాయతీల ఆధ్వర్యంలో ఆలయాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి పోచమ్మ ఆలయాల వద్ద అమ్మవారికి పచ్చిపులుసు, అన్నం, కోళ్లు, పొటేళ్లతో నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా దీవించడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి పూజలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు.

అమ్మా.. బైలెల్లినాదే

అమ్మా.. బైలెల్లినాదే