
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయ
వనపర్తి విధ్యావిభాగం: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.పవన్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ డబ్బులు రూ.7వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థులతో కలిసి ఉత్తరాలు రాస్తున్నామన్నారు. పెండింగ్ సమస్యతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి అధికమవుతోందని, కుటుంబాలపై భారం పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాజు, అనిల్, కవిత, రాజేందర్, ప్రవీణ్, కల్పన తదితరులు ఉన్నారు.