
శాకాంబరీదేవిగా వాసవీమాత..
ఆషాడమాసం సందర్భంగా పట్టణంలోని
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. అర్చకులు వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించి లక్ష పుష్పార్చన, సహస్ర కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు మహోత్సవం నిర్వహించి ఆలయంలో మహిళలు గోరింటాకు పెట్టుకున్నారు. నిర్వాహకులు షర్మిల, గాయత్రి, కవితరాణి, విజయలక్ష్మి, వీణ, శ్రీదేవి, అర్చన, వనజ, సంధ్యారాణి, సుధారాణి, పావని, అనురాధ, అపర్ణలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – ఆత్మకూర్