
వరద భయం..!
పెద్ద వాగుపై 50 ఏళ్ల కిందట కత్వ నిర్మాణం
వివరాలు 8లో u
●
మరమ్మతులు కరువు..
గతేడాది కత్వను ఎవరో ఓ పక్క కొంచెం పగలగొట్టారు. పెద్దవాగు పారడంతో మా పొలాల పక్కన తెగింది. దీంతో 0.15 ఎకరాల భూమి కోతకు గురైంది. కత్వ మరమ్మతులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశారు.
– బుగ్గని కర్రెన్న, మల్కిమియాన్‌పల్లి
కత్వ నిర్మాణం చేపట్టాలి..
ప్రభుత్వం కొత్తగా కత్వ నిర్మాణం చేపట్టాలి. లేకపోతే ఈ ఏడాది వర్షాలకు పెద్ద వాగు పారి పొలాలు మొత్తం కొట్టుకపోతాయి. గతేడాది 0.20 ఎకరాల భూమి కొట్టుకపోయింది. ఈ ఏడాది వాగు పారితే వందల ఎకరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కత్వ మరమ్మతు చేపడితేనే గణప సముద్రం రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది.
– చిట్యాల చెన్నయ్య, మల్కిమియాన్‌పల్లి
ప్రభుత్వానికి నివేదించాం..
ఖిల్లాఘనపురం మండలం మల్కిమియాన్‌పల్లి, అప్పారెడ్డిపల్లి, అన్‌పహడ్ శివారులో గణపసముద్రం రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు వాగుకు అడ్డంగా నిర్మించిన కత్వ గతేడాది వరదకు గండి పడింది. మరమ్మతు కోసం అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. మంజూరు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– మధుసూదన్‌రావు,
ఈఈ, నీటిపారుదలశాఖ
ఇతడి పేరు కప్పెట చెన్నయ్య. మండలంలోని మల్కిమియాన్‌పల్లి స్వగ్రామం.
గతేడాది పెద్ద వాగు పొంగిపొర్లి కత్వకు గండి పడి పక్కన ఉన్న 0.30 ఎకరాల
వ్యవసాయ భూమి కోతకు గురైంది. ఇసుక మేటలు వేయడం చూసి కన్నీటి
పర్యంతమయ్యారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలించి రూ.15 వేలు
పరిహారం అందించి చేతులు దులుపుకొన్నారు. ఈ వర్షాకాలంలో వాగు పారితే మరింత భూమి కోతకు గురయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతున్నారు.
ఖిల్లాఘనపురం: మండల కేంద్రం సమీపంలోని గణపసముద్రం రిజర్వాయర్(కాకతీయుల కాలంలో తవ్విన చెరువు)కు వర్షపు నీటిని మళ్లించేందుకు 50 ఏళ్ల కిందట పెద్దవాగుపై కత్వ (ఆనకట్ట) నిర్మాణం చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి, భీమునితండా తదితర ప్రాంతాలు, మండలంలోని మామిడిమాడ, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి, మల్కిమియాన్‌పల్లి, అన్‌పహాడ్, వెంకటాంపల్లి, కమాలోద్ధీన్‌పూర్, ఆగారం, అంతాయపల్లి, కొత్తపల్లి మీదుగా వచ్చే వర్షపు నీరు పెద్దవాగుకు చేరి కృష్ణానదిలో కలుస్తుంది. ఈ వాగుకు అడ్డంగా మల్కిమియాన్‌పల్లి, అప్పారెడ్డిపల్లి, అన్‌పహడ్ శివారులో కత్వ నిర్మించారు. వాగు పారే సమయంలో గణపసముద్రం రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేలా షట్టర్లను బిగించారు. ఏటా వాగు పారే సమయంలో అవసరమైన నీటిని మళ్లించి తర్వాత షట్టర్లను మూసి వేస్తారు. మిగతా నీరంతా కత్వ నిండి పైనుంచి పారేలా ఏర్పాట్లు చేశారు.
గతేడాది వరదలకు గండి
కోతకు గురైన పంట పొలాలు
నేటికీ మరమ్మతులు కరువు..
ఆందోళనలో అన్నదాతలు
పాటు కాల్వకు నిలిచిపోనున్న
పెద్ద వాగు, కేఎల్‌ఐ నీరు

వరద భయం..!

వరద భయం..!

వరద భయం..!