
ధాన్యం.. దోపిడీ!
జిల్లాలో ముగిసిన యాసంగి కొనుగోళ్లు
●
విచారణ చేపడతాం..
ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక తూకాల్లో కోతలపై పలువురు రైతులు ఇటీవల ఫిర్యాదు చేశారు. కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచే ఈ విషయంపై దృష్టి సారించాం. ఫిర్యాదులపై స్పందించి కొందరు రైతులకు డబ్బులు ఇప్పించాం. ఇప్పటి వరకు రైతుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తాం.
– జగన్మోహన్, డీఎం,
పౌరసరఫరాల కార్పొరేషన్, వనపర్తి
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ధర్మయ్య. గోపాల్‌పేట మండలం ఏదుట్ల స్వగ్రామం. గతేడాది యాసంగిలో 15 ఎకరాల్లో వరి సాగుచేయగా సుమారు 700 బస్తాల ధాన్యం పండింది. దీనిని గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. తీరా రైస్‌మిల్లుకు తరలించాక తేమశాతం ఎక్కువ ఉందంటూ ఏకంగా 17 క్వింటాళ్ల కోత విధించి అతడి అనుమతి లేకుండానే చెల్లించాల్సిన డబ్బుల్లో రూ.35 వేలు తగ్గించి మిగతావి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయిందని రైతు వాపోయారు. ఇలాంటి ఘటనలు ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం.’
కోతలు సరికాదు..
నేను యాసంగిలో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తే 50 క్వింటాళ్ల ధాన్యం పండింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తర్వాత మిల్లుకు తరలిస్తే సుమారు మూడు క్వింటాళ్ల కోత విధించారు. ఇందుకుగాను రావాల్సిన డబ్బుల్లో రూ.ఐదు వేలు తగ్గించి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మేము కష్టపడి పంటలు పండిస్తే మిల్లర్లు ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.
– ఎల్లస్వామి, రైతు, ఏదుట్ల (గోపాల్‌పేట)
● ట్రక్ షీట్ తూకాల్లో కోతలు..
నోరు మెదపని అధికారులు
● మంత్రి ఆదేశించినా..
మారని మిల్లర్ల తీరు
● ప్రతి లారీకి తప్పని వైనం
● లబోదిబోమంటున్న అన్నదాతలు

ధాన్యం.. దోపిడీ!

ధాన్యం.. దోపిడీ!

ధాన్యం.. దోపిడీ!

ధాన్యం.. దోపిడీ!