
రాజ్యాంగ పరిరక్షణ కోసమే జై సంవిధాన్
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే సహించం..
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను మోసం చేసి.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రైతులు పంటను సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులను తాలు పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అనంతరం మండలంలోని మియాపూర్‌లో పిడుగుపాటుకు గురై మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు కొత్త కళ్యాణ్‌రావు, చంద్రశేఖర్ యాదవ్, రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి, జ్యోతిగౌడ్, మహదేవ్ గౌడ్, తేజారెడ్డి, రంజిత్‌కుమార్, విభీషన్, జగదీశ్, ప్రకాశ్, పురేందర్ పాల్గొన్నారు.
చిన్నంబావి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం చిన్నంబావి మండలం వెల్టూరు నుంచి చిన్నమారూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. ప్రధాని మోదీకి బడాబాబులే ముఖ్యమయ్యారని విమర్శించారు. మహాత్మా గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.