
జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, నిర్వహించరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, రాజకీయ నాయకుల, కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా పోలీసులకు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని సూచించారు.