
అబద్ధాల చిట్టా చదివారు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈసారి బడ్జెట్‌లో పాలమూరు యూనివర్సిటీకి కేటాయింపులు పెరిగాయి. గతేడాది యూనివర్సిటీకి వేతనాల కోసం రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది రూ.200 కోట్లు అభివృద్ధి కోసం, రూ.66 కోట్లు వేతనాల కోసం ప్రతిపాదించారు. వేతనాల్లో కొత్తగా వస్తున్న ఇంజినీరింగ్, లా కళాశాలు, పీజీ కళాశాల సిబ్బంది వివరాలు కూడా ఉన్నారు. కాగా..ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం సిబ్బంది వేతనాల కోసం రూ.15.19 కోట్లు, అభివృద్ధి కోసం రూ.35 కోట్లును కేటాయించింది. మొత్తంగా పీయూకి రూ.50.19 కోట్లను కేటాయించారు. వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్పలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే అధికంగా నిధులు కేటాయించిందని, దీంతో యూనివర్సిటీ మరింత అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వికాసాన్ని కొద్ది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మళ్లీ అబద్ధాల చిట్టా చదివారు. ఒక్క ఏడాది నోరు కట్టుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మూడో బడ్జెట్‌లోనే చతికిలబడ్డారు. అధికారం చేపట్టి రెండేళ్లుగాకముందే తెలంగాణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. 15 నెలల్లో రూ.58 వేల కోట్లు అప్పుజేసి సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి అబద్ధాలు వండి వార్చారు. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి, వనపర్తి

అబద్ధాల చిట్టా చదివారు..