
బండి సంజయ్‌ను గజమాలతో సన్మానిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్‌రెడ్డి
పాలమూరు/ మహబూబ్‌నగర్ రూరల్: ‘డిసెంబర్ 3 తర్వాత పాలమూరు గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలి. కారును బొంద పెట్టాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణను కేసీఆర్ బెల్టు దుకాణాల కేంద్రంగా మార్చారు. బీజేపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించి, మోదీ రాజ్యం తీసుకువచ్చే బాధ్యత పాలమూరు బిడ్డలపై ఉంది.’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మీరు ఓటు వేసి గెలిపించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భూ కబ్జాలు, దందాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి మళ్లీ ఓటు వేస్తారా? లేకపోతే కష్టపడి పనిచేసే బీజేపీ అభ్యర్థికి అండగా ఉంటారో పాలమూరు ప్రజలే తేల్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్‌రెడ్డికి మద్దతుగా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని బొక్కలోనిపల్లి స్టేజీ వద్ద, జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ చౌరస్తాలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలమూరులో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటుకు రూ.10వేలు పంచేందుకు సిద్ధమైండని తెలిపారు. పాలమూరుకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు సైతం పూర్తి చేయలేదని విమర్శించారు. పాలమూరు యూనివర్సిటీకి నిధులివ్వకుండా, సిబ్బందిని నియమించకుండా పనికి రాకుండా చేశాడన్నారు. హిందూ సమాజమంతా ఏకం కావాలని, 80 శాతం ఓట్లతో హిందువుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మైనార్టీల నాశనం కోసం కేసీఆర్, ఓవైసీ ప్రయత్నిస్తే.. మోదీ త్రిబుల్ తలాక్ రద్దు చేసి ఎంతో మేలు చేశారన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2.40 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. వాటిని ఎవరికి ఇచ్చారని మంత్రిని గల్లపట్టి ప్రశ్నించాలన్నారు. నీ డబుల్‌బెడ్‌రూంల సంగతి పక్కనపెట్టు.. ముందు మోదీ ఇచ్చిన ఇళ్లు మాకు ఇవ్వు అంటూ నిలదీయాలని సూచించారు. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమ కేసులు ధ్యేయంగా పెట్టుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, బాలరాజు, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, మీడియా ఇన్‌చార్జి సతీష్‌కుమార్, మండలాధ్యక్షుడు రాజుగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment