జెడ్పీ చైర్మన్ల ఆత్మీయ భేటీ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్ల ఆత్మీయ భేటీ

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

విజయనగరం: విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని చిన్న శ్రీను క్యాంప్‌ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ ఆత్మీయ భేటీలో ఇరు జిల్లాల జెడ్పీ చైర్మన్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్‌ సీపీ సంస్థాగత కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం విజయనగరం జెడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీనును చిత్తూరు జెడ్పీ చైర్మన్‌ పట్టు శాలువాతో ఘనంగా సత్కరించి, తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.

చిన్న శ్రీనును మర్యాదపూర్వకంగా

కలిసిన చిత్తూరు జెడ్పీ చైర్మన్‌

గోవిందప్ప శ్రీనివాసులు

రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ

Advertisement
 
Advertisement
Advertisement