● రెండు పూరిళ్లు దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని తంపటాపల్లిలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో వారాడ రమణమ్మ, బెజ్జిపురపు అప్పలనాయు డుకు చెందిన పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. దేవుడి పటం ముందు పెట్టిన దీపాన్ని ఎలుకలు పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. ఒక్కసారిగా మంటలు రావడంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.


