పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయాడానికి కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. కార్యాలయంలోకి వచ్చేందుకు అవస్థలు పడుతున్న పోతురాజును గుర్తించిన కలెక్టర్ నేరుగా అతని వద్దకే వెళ్లి వినతిపత్రం స్వీకరించి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ..ఆరు వేల రూపాయలున్న అతని పెన్షన్‌ను రూ. 15 వేలకు పెంచాలని ఆదేశించారు.


